సీబీఐ విచారణకు సిద్ధమా?

  • నారాయణ స్కూల్లో పేపర్ లీకేజీ అతిపెద్ద స్కాం
  • మంత్రులపై చర్యలు తీసుకోవాలి
ఏపీ అసెంబ్లీ: పేపర్‌ లీక్‌ అంశంపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ముఖ్యమంత్రికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పేపర్ లీకేజీ అన్నది ఆరు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశమని, మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. లీకేజీ అంశంపై జరిగిన చర్చలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.... చంద్రబాబు చెప్పిన స్టేట్‌మెంట్‌కు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా ఎమ్మెల్యే సురేష్‌ కర్నూలులో జంబ్లింగ్‌ పద్ధతిలో 1978లోనే పరీక్ష రాశారు. చంద్రబాబు తానే జంబ్లింగ్ తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ ఒక్క నెల్లూరులోనే కాదు కదిరిలో కూడ లీక్‌ అయ్యింది.  నారాయణ యాజమాన్యం స్టాప్‌ స్లిప్పులు అందిస్తూ దొరికిపోయారు. ఇంత జరిగినా కూడా ప్రభుత్వం దానికి బాధ్యులైన మంత్రులపై చర్యలు తీసుకోకుండా విలేకరిపై చర్యలంటూ మాట్లాడడం శోచనీయం . 

వినే వారు ఉంటే చంద్రబాబు చెవిలో ఏమైన పెడతారు. సాక్షి విలేకరి మంచి మనసుతో పేపర్ లీకేజీ స్కాంను డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. 25న ఘటన జరిగితే ఎఫ్‌ఐఆర్‌ 28న ఫైల్‌ అయ్యిందన్న విషయం తెలుసుకోవాలి. సభలో మొన్న సీఎం స్టేట్‌మెంట్‌ ఇస్తారని స్పీకర్, మంత్రి యనమల చెప్పారు. వెల్‌లోకి వచ్చి చర్చ జరగాలని మేం డిమాండ్‌ చేసినా మీరు పలకలేదు. వాయిదా తీర్మానమే కాదు, 344 కూడా ఇచ్చాం. వీటిపై స్పీకర్, యనమల రామకృష్ణుడు ఇద్దరు కూడా 30న స్టేట్‌మెంట్‌ ఇస్తామని చెప్పారు. ఆ రోజు మేం నిరసన తెలిపాం. నేను ఫ్లైట్‌ టైం అయిపోతుందని ముందుగానే వెళ్లామని ఆరోపించారు.. నా కంటే ముందుగానే సీఎం గవర్నర్‌ విందులో ప్రత్యక్షమయ్యారు. ఎవరు ముందుగా వెళ్లారో అర్థం చేసుకోవాలి. 

పేపర్ లీక్ చేసి దాన్ని మాల్‌ ప్రాక్టిస్‌గా టాపిక్‌ డైవర్ట్ చేశారు. ఈ స్కాం గురించి  ఓ విలేకరి డీఈవోకు పంపిస్తే దాన్ని విజన్‌ బ్లోవరా?స్టింగ్‌ ఆఫరేషన్‌ అన్నది? సీబీఐ విచారణ వేయించండి. తేలుతుంది.  ఇందులో నారాయణ విద్యా సంస్థలను విచారణకు తీసుకురండి. విలేకరి కూడ సీబీఐకు సహకరిస్తాడు. చంద్రబాబు మాదిరి వచ్చి రాని స్కూల్‌ నుంచి నేను రాలేదు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి వచ్చాను. టెన్త్, ఇంటర్, డిగ్రిలో ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ను. నీలాగా వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లడలేను. నీలాగ డిస్కంటిన్యూ పీహెచ్ డీ చేయడం, ఎంఫిల్ చేయకపోయినా చేసినట్టు చెప్పుకోవడం మాకు తెలియదని వైయస్ జగన్ బాబుకు చురక అంటించారు. 
Back to Top