నంద్యాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

  • బాబులా మోసం చేయడం..అబద్ధాలు ఆడడం నాకు చేతకాదు
  • నంద్యాల ఎన్నిక న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం
  • బాబు మోసానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేద్దాం
  • వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం
  • రాబోవు కురుక్షేత్ర మహాసంగ్రామానికి నంద్యాల నాంది కావాలి
  • రైతునగరంలో వైయస్ జగన్ ప్రచారం
నంద్యాల(రైతునగరం)చంద్రబాబు చేస్తున్న మోసాలకు, అన్యాయాలకు, అధర్మాలకు వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు ఓటు వేయాలని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పిలుపునిచ్చారు. వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డితో కలిసి రైతునగరం నుంచి వైయస్ జగన్ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే....


నంద్యాలలో ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహన్ అన్నకు అందించండి. శిల్పాకు సంపూర్ణంగా మద్దతు పలకాల్సిందిగా ప్రతి అక్కాచెల్లెమ్మ, ప్రతి అవ్వతాత, ప్రతి సోదరుడు, స్నేహితుడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ధర్మానికి, అధర్మానికి...న్యాయానికి, అన్యాయానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబు, మంత్రులు ఇక్కడకు వచ్చినప్పుడు సూటిగా అడగండి.  నంద్యాలకు ఉపఎన్నిక రాకపోయింటే, వైయస్సార్సీపీ పోటీ పెట్టకపోయింటే మీరు నంద్యాలకు వచ్చి ఉండేవాళ్లా, డబ్బులు ఇచ్చేవాళ్లా అని అడగండి. భూమా నాగిరెడ్డి బామ్మర్ది ఎస్వీ మోహన్ రెడ్డి అన్న మాటలు ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలు కూడ తమ ఎమ్మెల్యేలు పోవాలని ఎదురుచూస్తున్నారట. వాళ్లు ఎప్పుడైతే  పైకి పోతారో అప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి...వైయస్సార్సీపీ పోటీ పెట్టినప్పుడే బాబు నిద్ర లేస్తారని భూమా బామ్మర్ది మాట్లాడుతున్నారంటే ప్రజలపై వారికి  ఏపాటి ప్రేమాభిమానాలున్నాయో అర్థమవుతోంది. 

ఎన్నికలప్పుడు రైతులకు బేషరతుగా రుణాలు మాఫీ అన్నాడు. ఎన్నికలయిపోయాయి వెన్నుపోటు పొడిచాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. వెన్నుపోటు పొడిచాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఉద్యోగం లేని వారికి  నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. చిన్నపిల్లలని కూడ చూడకుండా వెన్నుపోటు పొడిచాడు. ముఖ్యమంత్రి హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు కర్నూలుకు వచ్చినప్పుడు బాబు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయి.  ఏ ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా అని నేనడుగుతున్నా. కర్నూలు ప్రజల సాక్షిగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు ఉపఎన్నిక రాగానే మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అది చేస్తా, ఇది చేస్తానని వాగ్ధానాలు మొదలుపెట్టారు. బాబు మాదిరి మోసం చేయడం, అబద్ధాలు ఆడడం  నాకు చేతకాదు. ఆ గుణమే నాలో ఉండుంటే...నేను కూడ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఉంటే బాబు స్థానంలో నేనే కూర్చుండేవాడినేమో. నోట్లోంచి అబద్ధాలు రాలేదు, మోసం చేయలేదు. 

చంద్రబాబు మోసానికి, అన్యాయానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాబోవు కురుక్షేత్ర మహాసంగ్రామానికి నంద్యాల నాంది పలకాలి. ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలొస్తున్నాయి.  నంద్యాలలో బాబు చెబుతున్నవి చేస్తాడన్న నమ్మకం తనకైతే లేదు కానీ, నేను మాత్రం చేసి చూపిస్తానని చెబుతున్నా...? అందుకు కారణం ఉంది. ప్రజలకు మంచి జరగాలని ప్లీనరీలో నవరత్నాలని ప్రకటించాం. అవి ప్రతి ఇంటింకి చేరాలి. కుల, మత, ప్రాంతాలకతీతంగా ప్రతి ఇంటికి, పేదవాడికి చేరాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు రావాలి. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఓ జిల్లా చేస్తూ 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాలను జిల్లా చేస్తూ హెడ్ క్వార్టర్స్ చేస్తాం. నంద్యాలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పథంలో నడిపిస్తాం. కేసీ కెనాల్ లో నీళ్లు లేక సతమతమవుతున్న పరిస్థితిని బాబుకు చూపించి నిలదీయండి. మూడేళ్లయ్యింది. కర్నూలుకు వచ్చినప్పుడు గండ్రేవుల ప్రాజెక్ట్ ఎక్కడ మొదలుపెట్టావని గట్టిగా నిలదీయండి. బాబుకు మునిశాపం ఉంది. ఆయన పొరపాటున  నిజం చెబితే తల వెయ్యిముక్కలవుతుందని శాపం ఉంది. అందుకే నిజాలు చెప్పడు. తాను మాత్రం అబద్ధాలు చెప్పను. ధర్మం, న్యాయం వైపు నిలబడి ఓటేసి రాష్ట్ర ప్రజానీకానికి చేర్చండి అని వైయస్ జగన్ రైతునగరం ప్రజలకు పిలుపునిచ్చారు. 

Back to Top