బాబు అవినీతి పాలనకు బుద్ధి చెప్పండి

నంద్యాల: అవినీతి సొమ్ముతో గెలవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు నంద్యాల ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలో ఏడవరోజు పర్యటించారు. మూలసాగరంలో వైయస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఓటరుకు రూ.5వేలు ఇచ్చి దేవుడి పటంపై ప్రమాణం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆయన మనుషుల పట్ల ఓటర్లు లౌక్యంగా వ్యవహరించాలని  కోరారు. ఆ సందర్భంలో దేవుణ్ని స్మరించుకుని లౌక్యంగా వ్యవహరించాలని, ధర్మానికి మాత్రమే ఓటు వేయాలని, న్యాయాన్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైయస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మూడేళ్లుగా చంద్రబాబు ప్రజలను వంచిస్తున్న తీరును జగన్‌ వివరించారు.

‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ చంద్రబాబు అమలు చేయలేదు. రుణమాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. బాబు వస్తే జాబ్‌ వస్తుందని, జాబ్‌ రాకుంటే ఇంటికో రూ.2వేలు చొప్పున భృతి కల్పిస్తామని చెప్పారు. ఆ లెక్కన ఈ 38 నెలల్లో చంద్రబాబు ఇంటింటికీ కలిపి రూ.76వేలు బాకాయి పడ్డారు. మరోవైపు ఢిల్లీలో ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి తనపై ఉన్న కేసులనుంచి రక్షణ పొందారు. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా కర్నూలులో ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగించిన చంద్రబాబు.. జిల్లాకు పలు హామీలిచ్చారు. వాటిలో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. వైయస్సార్‌సీపీ అభ్యర్థిని ఆశీర్వదించండి.. ధర్మానికి ఓటేసి, న్యాయాన్ని గెలిపించండి’ అని వైయస్‌ జగన్‌ అన్నారు.

బాబు మాదిరి నా దగ్గర అధికారం, డబ్బులు, పోలీసులు లేరు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే టీవీ, పత్రికలు లేవు. నాకున్న ఆస్తి. దివంగత ప్రియతమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి 8ఏళ్ల కిందట చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. నాకున్న ఆస్తి వాళ్ల నాన్న మాదిరిగానే గొప్ప పరిపాలన అందిస్తాడన్న నమ్మకం. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే నా ఆస్తి. నంద్యాలలో బాబు వందలకోట్లు పంపకాలు చేస్తున్నాడు. చిన్నచితకా లీడర్ల దగ్గర్నుంచి అందరినీ నీ రేటు ఎంత అని బేరసారాలు చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడీయో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...సీబీఐ ఎంక్వైరీ జరగకుండా మోదీ కాళ్లు పట్టుకున్నాడు. ప్రతీ సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. మళ్లీ మోసపూరిత వాగ్ధానాలతో వస్తున్నాడు. బాబు మోసపూరిత, అధర్మ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలకు జగన్ విజ్ఞప్తి చేశారు.
Back to Top