మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఓటేద్దాం

ఎం. కృష్ణాపురం)) చంద్రబాబు ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడంతో రైతులు బ్యాంకుల గడప తొక్కని పరిస్థితి నెలకొందని వైయస్ జగన అన్నారు. ఎం కృష్ణాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే.... ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని బాబు ఊదరగొట్టాడు. జగన్ రూ. 3వేల కోట్లతో పెడతానంటే ఆయన కన్నా ఎక్కువగా పెడతానని రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నడు. ఇంతవరకు అతీగతీ లేదు.  మిర్చీ, మినుము, పసుపు, శనగ, కంది ఏంపటకు గిట్టుబాటు ధర లేదు.  కేసీ కెనాల్ లో వైయస్ఆర్ హయాంలో 2 పంటలు పండడం చూశాం. బాబు ముఖ్యమంత్రి మూడున్నరేళ్లయ్యింది. ఇవాళ ఒక్కపంటకు కూడా నీళ్లు అందని పరిస్థితి. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కంట్లో నీళ్లు తిరిగితే రాష్ట్రానికే అరిష్టం. బాబు అక్కచెల్లెమ్మలకు సంబంధించి రూ. 14వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ కథ దేవుడెరుగు..వడ్డీలేని రుణాలు కూడ ఎగరగొట్టాడు. పొదుపు సంఘాల మహిళలను నిట్టనిలువునా ముంచాడు. రైతులు, డ్వాక్రా అక్కచెల్మెమ్మలనే కాదు చదువుకునే పిల్లలను కూడ వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ నెలకు రూ.2వేలు ఇస్తానన్నాడు. ఇప్పటికీ 38 నెలలయింది. ప్రతీ ఇంటికీ 76వేలు బాకీ పడ్డడు. పేదవాళ్లు ఆశగా ఎదురుచూస్తున్న ఇళ్లను ఎగరగొట్టాడు. మూడు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశాడు. బాబు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top