నంద్యాల‌లో జ‌న‌నేత గ‌డప గ‌డ‌ప‌కూ ప్ర‌చారం

నంద్యాలః నంద్యాల ప‌ట్ట‌ణంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారం 8వ రోజు కొన‌సాగుతుంది. నంద్యాల టౌన్ 3వ వార్డులో జ‌న‌నేత గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంతా న్యాయంవైపు నిల‌వ‌డి వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డిని గెలిపించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను కోరారు. వైయస్ జగన్ తో కరచాలనం చేసేందుకు స్థానిక ప్రజలు పోటీ ప‌డుతున్నారు. యువ‌త వైయ‌స్ జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తోంది.

Back to Top