మళ్లీ.. బిజీ బిజీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు. పది రోజుల పాటు వైయస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి ఇంగ్లాండ్ లో పర్యటించారు.  తిరుగు ప్రయాణంలో భాగంగా లండన్ లో అభిమానులు వైయస్ జగన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.  విదేశీ పర్యటన లో  వివిధ సందర్భాల్లో  వైయస్ జగన్ క్రీడలకు సంబంధించిన ఫోటోలు నెట్ లో హల్చల్ చేశాయి.  వైయస్ జగన్ చెస్, ఫుట్ బాల్, గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు నెట్టింట సందడి చేశాయి. చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. 

విదేశీ పర్యటన అనంతరం వస్తూనే వైయస్ జగన్ మళ్లీ బిజీ అయిపోయారు. జూలై 1,2న  వైయస్ జగన్  రెండ్రోజుల పాటు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

 
Back to Top