నూతన జంటకు వైఎస్ జ‌గ‌న్ ఆశీర్వాదం

కర్నాటకః  క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే జ‌య‌రాం త‌మ్ముడి కుమార్తె వివాహ వేడుక‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే జ‌య‌రాం త‌మ్ముడు శ్రీ‌నివాసులు కుమార్తె అమృత‌, వ్యాపార‌వేత్త గాదిలింగ‌ప్ప కుమారుడు ర‌ఘుల వివాహం గురువారం రాత్రి జరిగింది. ఈ వివాహ వేడుక‌లో పాల్గొనేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో బ‌ళ్లారికి చేరుకున్నారు. విమానాశ్ర‌యంలో వైఎస్ జ‌గ‌న్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్ర‌సాద్‌రెడ్డి, బాల‌నాగిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, బ‌ళ్లారి జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర‌, బ‌ళ్లారి మాజీ ఎంపీ శాంత‌, సృష్టి డెవ‌ల‌ప‌ర్స్ మ‌ల్లికార్జున, తిమ్మారెడ్డి, ర‌విక‌ల్యాణ్ ఘన స్వాగ‌తం ప‌లికారు.

Back to Top