సౌదీ, అమెరికాలో ఘనంగా వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు


హైద‌రాబాద్‌ :  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను సౌదీ అరేబియా, అమెరికా దేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి వైయ‌స్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సజావుగా సాగాలని మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును ఉద్యోగం చేస్తున్న కంపెనీలో సహ ఉద్యోగులతో కలిసి జరుపుకున్నారు. సౌదీ వేడుక‌ల్లో షేక్‌ సలీమ్‌, మహమ్మద్ సిరాజుద్దిన్‌‌, షేక్‌ ఫరిద్‌, మహమ్మద్‌ సిరాజ్‌, షేక్‌ ఇమ్రాన్‌, హమీద్‌, మున్వర్‌, ఆమేర్‌, గాలేబ్‌, షేక్‌ అప్సర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

 అమెరికాలో ప్రార్ధనలు
 వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైయ‌స్‌ఆర్‌ సీపీ అమెరికా కమిటీ సభ్యులు గురువారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కనెక్టికట్‌ స్టేట్‌ హిందూ దేవాలయంలో వైయ‌స్‌ జగన్‌ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించామని కమిటీ కన్వీనర్‌ రత్నాకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కూడా హాజరైనట్లు వెల్లడించారు.

Back to Top