వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున‌ ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. కేక్‌లు క‌ట్ చేసి జ‌న‌నేత‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.అంతేకాదు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ర‌క్త‌దాన శిబిరాలు, వ‌స్త్రాలు, బుక్‌లు, పండ్లు పంచ‌డం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. మ‌రికొంద‌రు వైయ‌స్ జ‌గ‌న్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని పూజ‌లు చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భారీ కేక్‌ను క‌ట్ చేసి వైయ‌స్ జ‌గ‌న్‌కు శుభాకాంక్షులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. అనంత‌రం చీర‌ల పంపిణీ కార్య‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

తాజా ఫోటోలు

Back to Top