విశాఖలో వైయస్‌ జగన్‌ ముందస్తు జన్మదిన వేడుకలు

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 44వ పుట్టిన రోజు వేడుకలు విశాఖలో ఒక రోజు ముందే నిర్వహించారు. ఈ నెల 21న జననేత జన్మదినం కాగా, మంగళవారమే పార్టీ శ్రేణులు నిరాడంబరంగా వేడుకలు ఏర్పాటు చేసి అభిమాన నేత చేత కేక్‌ కోయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 19న విజయనగరంలో తలపెట్టిన యువభేరి కార్యక్రమానికి హాజరైన వైయస్‌ జగన్‌ రాత్రికి విశాఖ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నేతలు మంగళవారం ఉదయం వైయస్‌ జగన్‌ వద్దకు వచ్చి కేక్‌ కట్‌ చేయించారు. మరో వైపు ఆయన అభిమానులు విమానాశ్రయం వద్ద భారీ కేక్‌ ఏర్పాటు చేసి వైయస్‌ జగన్‌ చేత కట్‌ చేయించి అడ్వాన్స్‌ విసెస్‌ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైయస్‌ జగన్‌ కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top