కువైట్ లో వైయస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 44వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, కమిటీ సభ్యులు రక్తదానం చేశారని వైయస్సార్‌సీపీ గల్ఫ్‌ కువైట్‌ కన్వీనర్‌ ఇలియాస్, బి.హెచ్‌.ఎం.బాలిరెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కువైట్‌ జాబ్రియా ప్రాంతంలో ఉన్న బ్లడ్‌ బ్యాంక్‌లో కమిటీ సభ్యులు మర్రి కళ్యాణ్, పి.రఫీక్‌ఖాన్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కో–కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎం.వి.నరసారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.మహేశ్వర్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, అన్నాజీ శేఖర్, కె.రమణయాదవ్, పులపుత్తూరు సురేశ్‌రెడ్డి, జి.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, షేక్‌ రఫీ, రావూరు రమణ, ఫయాజ్, ఆకుల చలపతి, జగన్, రాజు, కల్లూరు వాసుదేవరెడ్డి, కె.నాగసుబ్బారెడ్డి, లక్కిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, రవిశంకర్, లక్కిరెడ్డి రాజారెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, ప్రసాద్, ఇతర అభిమానులకు ఇలియాస్, బాలిరెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


Back to Top