వైయస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్

  • ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
  • ప్రపంచవ్యాప్తంగా జననేతకు అభినందనల వెల్లువ
  • పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లోటస్ పాండ్ లోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి ప్రియతమ నేత వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పార్థసారధి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, కొరుముట్ల శ్రీనివాసులు పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

వైయస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. ఆస్పత్రుల్లో పెషెంట్లకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. పార్టీ నేత వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నుంచి లోటస్ పాండ్ వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హస్తినాపురంలో వైయస్సార్ సీపీ అధికార ప్రతినిథి కీర్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు, దుప్పట్లు, మిక్సీలు పంపిణీ చేశారు.

వైయస్ఆర్ జిల్లా కడపలో వైయస్ఆర్ సీపీ ఆఫీసులో పార్మీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ రెడ్డి, పార్టీ నేతలు కేక్ కట్ చేసి వైయస్ జగన్ జన్మదిన వేడుక నిర్వహించారు. 

అనంతపురంలో పార్టీ ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి, తదితరులు ఘనంగా పార్టీ అధినేత పుట్టిన రోజు వేడుకలు చేశారు. 

తిరుపతిలో నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి చక్రపాణిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేకపూజలు చేసి, ఆస్పత్రిలో పేషెంట్లకు బ్రెడ్డు, పాలు పంపిణీ చేశారు. వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టేకులపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు.

విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పైడితల్లి అమ్మవారి ఆలయంలో జగన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. 

కర్నూలు జిల్లా పార్టీ ఆఫీసులో అంధులకు రూ.5వేలు చెక్కును జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి అందజేశారు. 

కరీంనగర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. 

సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వైయస్సార్‌సీపీ యూత్ జిల్లా నాయకులు జల్లి వేణు ఆధర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు స్వీట్స్ పంచి పెట్టారు.


Back to Top