వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు జననేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేస్తున్నారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకులను జరుపుతున్నారు. వైఎస్ జగన్ నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన వైఎస్ జగన్ తో మాత్రమే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

అంతకు ముందు లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నేతలు బర్త్ డే విషెష్ తెలిపారు. అలాగే అభిమానులు తెచ్చిన కేక్ ను ఆయన కట్ చేశారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలోనూ సభాపర్వం వైఎస్ జగన్ కు బర్త్ డే విషెస్ తెలియజేసింది. 
Back to Top