వైయస్ జగన్ సీఎం అవడం ఖాయం

  • నాన్నకు, వైయస్‌ఆర్‌కు గొప్ప అనుబంధం ఉండేది
  • ఢిల్లీ ముక్కుపిండే సత్తా వైయస్ జగన్ కే ఉంది
  • టీడీపీని విసిరి బంగాళాఖాతంలో పడేద్దాం
  • ద్వారకా తిరుమల సభలో కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు
ద్వారకా తిరుమల: వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం మధ్య మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే...ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో పెట్టడానికి ముఖ్యకారణం నా అన్నప్రసన్నం నుంచి విద్యాభ్యాసం మొదలు అన్ని ఇక్కడి నుంచే జరిగింది. మా కుటుంబం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలోకి రావాలని నిర్ణయించారు. మా మనవి అంగీకరించి ఇక్కడికి వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. విద్యాధరరావు 1983లో ఇండిపెండెంటుగా గెలిచారు. ఆ తరువాత ఐదు సార్లు టీడీపీ నుంచి గెలిచారు. 2005లో ఓడిపోయినా కానీ వైయస్‌ఆర్‌ గెలిచారని ఆనందించారు. ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తారని ఆనందించారు. మా నాన్నకు, వైయస్‌ఆర్‌కు గొప్ప అనుబంధం ఉండేది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ జిల్లా ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. 

2013లో కాలం చేసే ముందు నేను రాజకీయాల నుంచి ఉపసంహరించుకుంటున్నాను. నీవు ఏ పార్టీలో చేరిన అభ్యంతరం లేదు. కానీ టీడీపీలో మాత్రం చేరవద్దని ఆనాడు సూచించారు. ఆ పార్టీలో 15 సంవత్సరాలు ఉన్నా..మనది ఆ పార్టీ అన్న భావన చూపించలేకపోయారు పెద్దలు. అదే రోజు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడవాలని నాన్న చెప్పారు. చిన్నవయసులో వైయస్‌ఆర్‌సీపీ స్థాపించి, ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని నాన్నగారే చెప్పారు. చంద్రబాబు గురించి కొంత మాట్లాడుకోవాలి. బాబు జీవిత అనుభవం, రాజకీయ అనుభవం మొత్తం కూడా ప్రతి ఎన్నికల్లో మన ఓట్లు వేయించుకోవాలనే  ఆలోచిస్తారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలన అంటే పూర్తి పట్టు, నాయకత్వ లక్షణాలు వైయస్‌ఆర్‌కు ఉన్నాయి.  అది మళ్లీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  వచ్చాయి. వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం. 

నా గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. నేను నూజీవీడులో పుట్టాను, ఏలూరులో ఉంటున్నాను. నాన్నగారికి సాయం చేస్తూ మూడు ఎన్నికల్లో పనిచేశాను. పోలవరం, ఉంగుటూరు, చింతలపూడిలో పనిచేశాను. గత 12 సంవత్సరాలుగా నాకు పరిచయమైన ఏ వ్యక్తిని దూరం చేసుకోలేదు. మాములుగా మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూస్తే కోపముంటుంది. నాకు ఓర్పు, సహనం ఉంది. హంగు, ఆర్భాటం లేదు. మ్యానిఫెస్టోలు చూసి మోస పోవద్దు..ఇక నేను సిద్ధం. ఒక బలమైన నాయకుడితో కలిసి నడుస్తున్నాను. పోలవరం వైయస్‌ఆర్‌ పుణ్యమే. ఆ రోజు చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పారు. ఈరోజు ఎన్నో కబుర్లు చెబుతున్నారు. మనం ఢిల్లీ నాయకుడ్ని ముక్కు పిండి పని చేయించుకోవాలి. ఆ సత్తా వైయస్‌ జగన్‌లో ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం బాధపడ్డాం. మొదటి ముద్దాయి కింద కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేశాం. రెండో ముద్దాయి టీడీపీనే. ఆ పార్టీని బంగాళఖాతంలో కలుపుదాం. 

ఏలూరు పార్లమెంట్‌కు రెండు సమస్యలు ఉన్నాయి. కొల్లేరు సమస్యను పరిష్కరించాలి. ప్రతి ఇంటికి తిరిగి ఉంగటూరు, కైకలూరులో పర్యటించి వైయస్‌ జగన్‌కు ప్రతిపాదనలు అందజేస్తాను. ఏలూరు కార్పొరేషన్‌ అయింది..కానీ ఈ రోజు ప్రతి వస్తువు విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది. ఏలూరుకు జీవం పోయాలి. మీ అందరి తరఫున వైయస్‌ జగన్‌ను కోరుతున్నా..మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏలూరును అభివృద్ధి చేయాలి. నేను వైయస్‌ జగన్‌ను కలిసినప్పుడు శ్రీధర్‌ నాతో ఉండూ..అందరం కలిసి అభివృద్ధి చేద్దామన్నారు. ఆళ్లనాని, బాలరాజు, దయాల్‌నవీన్, డీఎన్‌ఆర్, ప్రతాప్, రామచంద్రావు ఇలా ప్రతి ఒక్కరూ నాకు సహాయపడుతున్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు కష్టపడుదాం. కోటగిరి విద్యాధరరావు, వైయస్‌ఆర్‌ దీవెనలు ఉన్నాయి. నన్ను వైయస్‌ జగన్‌ ఓ కుటుంబ సభ్యుడిలా స్వీకరించారు. నేను కూడా నమ్మకంగా ఉంటానని అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top