విభజనకు నిరసనగా బంద్‌కు జగన్ పిలుపు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న
నిర్ణయానికి నిరసనగా శుక్రవారం బంద్ పాటించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విభజన వల్ల నష్టపోయే ప్రాంత ప్రజలంతా
మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన
విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం రాష్ట్ర
వినాశనం దిశగా వారు వేసిన మరో ముందడుగు అని గురువారం రాత్రి శ్రీ జగన్ విడుదల
చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.రాష్ట్ర విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ
నిర్ణయం వెలువడించిన వెంటనే శ్రీ జగన్ స్పందిస్తూ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా
ఉంచాలని 75 శాతం మంది ప్రజలు నాలుగు నెలలకు పైగా ఉద్యమం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం
ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా వారి ఓట్లూ, సీట్ల కోసం దిగజారి పోయాచని
విమర్శించారు. శుక్రవారం బంద్‌ కు ఉద్యోగ, కార్మిక సంఘాలు, రైతులు... ఈ సమాజంలో
ప్రతి ఒక్కరూ స్వచ్ఛదంగా సహకరించాలని శ్రీ జగన్ విజ్ఞప్తి చేశారు.వివిధ సంఘాల మద్దతు:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ
జగన్మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం బంద్‌ కు వివిధ ఉద్యోగ సంఘాలు మద్దతు
ప్రకటించాయి. స్టేట్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, సీమాంధ్ర మున్సిపల్ ఎంప్లాయిస్ జేఏసీ, సీమాంధ్ర గెజిటెడ్
అధికారుల సంఘం,  సీమాంధ్ర ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల జేఏసీ, వైయస్ఆర్ ఆర్‌టీసీ
మజ్దూర్ యూనియన్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top