'భీమవరంలొ ఆత్మీయ నేతపై అభిమాన వర్షం'

భీమవరం: వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం భీమవరం వెళ్ళారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్‌రెడ్డి, రెడ్డి అండ్ రెడ్డి గ్రూపు సంస్థల యజమాని శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యారెడ్డి వివాహ బంధంతో ఒక్కటవుతున్న తరుణంలో ఆ జంటను ఆశీర్వదించి.. ఆత్మీయ దంపతులై నిండు నూరేళ్లు వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.      
Back to Top