ద్వారంపూడి కుమార్తె వివాహానికి హాజరైన జగన్

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె అంజని, హర్షవర్ధన్‌రెడ్డిల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భాస్కరపద్మ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు, అనధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సాక్షి డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు విచ్చేశారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వ విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేడుకకు హాజరయ్యారు
Back to Top