అనూహ్య తండ్రి ప్రసాద్‌కి జగన్‌ అండ

మచిలీపట్నం :

ముంబాయిలో దారుణంగా హత్యకు అనూహ్య గురవటం చాలా బాధగా ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 'ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్య బలైపోయిన ఈ కష్టంలో మేం మీకు అండగా ఉంటాం’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో ఉన్న ఆయన సోమవారంనాడు ప్రసాద్‌ను ఫోన్‌లో పరామర్శించారు. అనూహ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనూహ్య కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, దోషులకు శిక్ష పడేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని ఈ సందర్భంగా ప్రసాద్‌కు శ్రీ జగన్ చెప్పారు. అవసరమైతే వై‌యస్ఆర్‌సీపీ తరఫున ఎంపీల బృందాన్ని మహారాష్ట్రకు పంపుతామన్నారు. దోషులకు శిక్ష పడేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శ్రీ వైయస్ జగ‌న్ చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top