పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ్య‌తిరేకం కాదు

() నిర్వాసితుల‌కు త‌గిన న్యాయం చేయండి
() శాస‌న‌స‌భ త‌ర‌పున క‌మిటీ వేసి అక్క‌డ‌కు పంపిద్దాం
() ప్ర‌భుత్వానికి సూచించిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్య‌తిరేకం కాద‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అక్క‌డ నిర్వాసితుల‌కు స‌రైన ప‌రిహారం అంద‌టం లేద‌ని, త‌గిన న్యాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. శాస‌న‌స‌భ త‌ర‌పున క‌మిటీ వేసి ఆదుకోవాల‌ని ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి ఆయ‌న సూచించారు. 

ప్ర‌భుత్వం ఇస్తున్న ప‌రిహారం నిర్వాసితుల‌కు అంద‌టం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ స‌భ‌కు తెలియ చేశారు. అక్క‌డ పున‌రావాస పనులు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌టం లేద‌ని వివ‌రించారు. పోల‌వరం ప్రాజెక్టుకు తామెవ్వ‌రూ వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. నిర్వాసితుల్ని ఉసురు పెట్టి ప్రాజెక్టు క‌ట్టుకోవ‌టం సరి కాద‌ని పేర్కొన్నారు. నిర్వాసితుల‌కు ఆర్ అండ్ ఆర్ పరిహారం అంద‌టం లేద‌ని చెప్పారు. అక్క‌డ నిరంత‌రాయంగా ధ‌ర్నాలు, నిరాహార దీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. అందుచేత అక్క‌డ‌కు ఎమ్మెల్యేల‌తో క‌మిటీ వేసి అక్క‌డ‌కు పంపిద్దామ‌ని చెప్పారు. స‌భ క‌మిటీ వేసి అక్క‌డ ప‌రిశీల‌న చేయిద్దామ‌ని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంద‌రికీ అమ‌లు అవుతోందో లేదో తెలిసిపోతుంద‌ని వివ‌రించారు. 

ప్రాజెక్టు కోసం తీసుకొంటున్న జ‌నావాసాల్లో ఏ ర‌కంగా ప‌రిహారం ఇవ్వాల‌నేది స్ప‌ష్టంగా ఉంద‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. కొత్త ప్రాంతంలో ఇల్లు, పొలం క‌ల్పించ‌టంతో ఎదిగిన ఆడ‌పిల్ల‌ల పెళ్లి ఖ‌ర్చులు ఇవ్వ‌టం వంటివి ప్యాకేజీల్లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అక్క‌డ అవేమీ అమ‌లు చేయ‌టం లేద‌ని చెప్పారు. అక్క‌డ గ్రామ‌స్తుల్ని ఖాళీ చేయ‌టానికి అక్క‌డ తాగునీటి స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్నార‌ని, క‌రెంట్ ఆపేశార‌ని, వైద్యుల్ని పోనివ్వ‌టం లేద‌ని స‌భ ద్ర‌ష్టికి తీసుకొచ్చారు. రెండు నెల‌లుగా అక్క‌డ ధ‌ర్నాలు, నిరాహార దీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. 

ప‌ట్టిసీమ ప‌థ‌కం కోసం అప్ప‌టిక‌ప్పుడు ఎక‌రాకు రూ. 20 లక్ష‌ల చొప్పున ప‌రిహారం ఇచ్చార‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. ఇదే మాదిరిగా న్యాయ‌బ‌ద్దంగా ప‌రిహారం అందించాల‌ని పేర్కొన్నారు. ప‌రిహారం అనేది మొత్తం ప్రాజెక్టులో 2..3 శాతం మించ‌ద‌ని చెప్పారు. అటువంటప్పుడు అంచ‌నా వ్య‌యం పెర‌గటం అన్న‌ది జ‌ర‌గ‌ద‌ని వివ‌రించారు. పైగా గ‌తంలో ఇచ్చిన ప‌రిహారం ప్యాకేజీని అక్క‌డ‌వారు తీసుకోలేద‌ని పేర్కొన్నారు. తాజా చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం కేటాయించాల‌ని చెప్పారు. 
Back to Top