ఆశావర్కర్ల ఆందోళనకు జగన్ మద్దతు

ధర్మాసాగర్ లో ఆశావర్కర్లను కలిసిన జగన్
తమ గోడు వెళ్లబోసుకున్న వర్కర్లు
న్యాయం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ 

వరంగల్ : ఆశావర్కర్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఆశావర్కర్లకు జగన్ మద్దతు తెలిపారు. తమ డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు 78 రోజులుగా సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

ఆశావర్కర్ల నెల సంపాదన రూ. 500 నుంచి రూ. 1000 మాత్రమే ఉంటుందని...కిలో టమాట రూ.50, కందిపప్పు రూ.230 లు ధర పలుకుతున్న సమయంలో వాళ్లు ఎలా బతుకుతారని జగన్ టీఆర్ఎస్ సర్కార్ ను ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాసమస్యలను పట్టించుకునేలా ఉండాలని హితవు పలికారు. ఆశావర్కర్లను చూస్తోంటే గుండెతరుక్కపోతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాలని గులాబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   

కేసీఆర్ కు సమస్యలు చెప్పుకుందామని బహిరంగసభ జరుగుతున్న ప్రదేశానికి వెళితే...తమను కొట్టి వెళ్లగొట్టారని ఆశావర్కర్లు వైఎస్ జగన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. నిన్న గీసుకొండ మండలం, కోనాయమాకులలోనూ రిలేదీక్షలు చేస్తున్న ఆశావర్కర్ల శిబిరాన్ని వైఎస్ జగన్ సందర్శించారు. ఈసందర్భంగా వారు జగన్ కు తమ బాధలు చెప్పుకున్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top