వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆందోళన...!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. రోజురోజుకు వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ,పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఉదయం వైద్యులు వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 

వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ  110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Back to Top