"వెల్‌డన్ రవి"


పశ్చిమగోదావరి: వెల్‌డన్ రవి... రైతు దీక్షను విజయవంతం చేశారంటూ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్‌ను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రైతుదీక్ష ముగించుకుని విజయవాడ వెళుతూ జగన్‌మోహన్‌రెడ్డి రవీంద్రనాథ్‌ను పిలిచి ఆలింగనం చేసుకుని అభినందించారు. చక్కగా సమన్వయంతో దీక్షను విజయవంతం చేశారంటూ కితాబునిచ్చారు. వంక రవీంద్ర జగన్ వెంట గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు వెళ్లి ఆత్మీయంగా సాగనంపారు.

అన్నీ తానైన వంక రవీంద్ర
రుణమాఫీతో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన రైతుదీక్ష విజయవంతంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ అన్నీ తానై కీలక భూమిక పోషించారు. దీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రాంతాల నాయకులతో సమన్వయం చేసుకుని చకచకా పనులు చేయిస్తూ ముందుండి నడిపించారు. సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కారుమూరి నాగేశ్వరరావులతో కలిసి ఏర్పాట్లు సాగించడంతో పాటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తలు, నాయకులను భాగస్వాములను చేస్తూ దీక్ష ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రైతు దీక్షను ఎందుకు విజయవంతం చేయాలో విశదీకరించారు.
Back to Top