బీసీ అధ్యయన కమిటీ నియామకం


విజయవాౖడ: రాష్ట్రంలో బీసీ సమస్యలపై అధ్యయనం చేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిఫక్షనేత వైయస్‌ జగన్‌ బీసీ కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. కమిటీ కన్వీనర్‌గా వైయస్‌ఆర్‌ సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని నియమించారు. ఇందులో సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలను ప్రకటించారు. సభ్యులుగా పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొలుసు పార్థసారధి, గుమ్మనూరు జయరాం, నర్సేగౌడ కొట్టమూడి సురేష్‌బాబు, మేకా శేషుబాబు, సీహెచ్‌ వేణుగోపాల్‌రావు, జోగి రమేష్, కె. చంద్రమౌళి, మక్కగారి క్రిష్టప్ప, చిల్లపల్లి మోహన్‌రావులను నియమించారు. 
ప్రత్యేక ఆహ్వానితులు...
బీసీ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా శంకర్‌నారాయణ, కోల గురువులు, రాగె పరశురాం, సుగుమంచిపల్లె రంగన్న, అవ్వారు ముసలయ్య, పగడాల గొల్ల పుల్లయ్య, రసూల్‌ సాహేబ్, బొమ్మిని శ్రీనివాసరావులను నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ సంఘాలతో, వివిధ వృత్తి సంఘాలతో సమావేశమై వారి సమస్యలపై అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌కు నివేదిక సమర్పించనున్నారు. 
Back to Top