హైదరాబాద్) నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన నిర్లక్ష్య పూరిత వైఖరి మీద ఆయన అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆయన స్పష్టంగా ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు.ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి కరపత్రాలు పంచారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని, లేదంటే రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మ బలికారని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన కరపత్రం అని ఆయన అన్నారు. ఇంట్లో పిల్లలు పెద్దగా చదువుకోకపోయినా ఫర్వాలేదు, ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు కోటీ 75 లక్షల ఇళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నాయని వివరించారు. ఉద్యోగాలు వస్తాయి, లేదా నిరుద్యోగ భృతి వస్తుందని ఆశపడుతున్నారని చెప్పారు. <br/>ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే..ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష పెట్టిందని, కానీ 18 నెలలుగా మెరిట్ లిస్టు రాక, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలీక అవస్థలు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1, 42, 828 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విభజన సమయంలో ప్రభుత్వమే లెక్కలు కట్టిందని చెప్పారు. కానీ ఇప్పుడు రిక్రూట్ మెంట్ క్యాలండర్ లేదని, డీఎస్సీ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలీదని వివరించారు. ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ, క్లస్టర్ విధానం తో స్కూల్స్, హాస్టల్స్ తగ్గిస్తున్నారని వివరించారు. దీంతో 7వేల ఉద్యోగాలు అదనంగా ఉన్నట్లు లెక్కలు కట్టారని చెప్పారు. ఎన్నికల సమయంలో అవుట్‌సోర్సింగ్, కాంటాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తామని చెప్పారని, ఇప్పుడు వాళ్లను తొలగిస్తున్నారని చెప్పారు. రెండు లక్షల మంది ఉద్యోగాలు అభద్రతా భావంతో కాలం వెళ్లబుచ్చుతున్నారని చెప్పారు.<br/>ప్రభుత్వ నిర్వాకంతో ఆరోగ్యమిత్ర, గోపాల మిత్ర ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారని చెప్పారు. వీఆర్ ఏ, ఆశ వర్కర్లకు జీతాలు పెంచటం లేదని, ఇందుకోసం ఆందోళన చేస్తుంటే అరెస్టులుచేస్తున్నారని పేర్కొన్నారు. ఆదర్శ రైతుల్ని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు.దయా దాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా.. ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని నమ్మ బలికి కోటీ 75లక్షల ఇళ్లను మోసం చేస్తున్నందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వై ఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. <br/>