వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు

తూర్పు గోదావరి:వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా మంగళవారం పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  జూన్‌ 12న తూర్పు గోదావరి జిల్లాలోకి వైయస్‌ జగన్‌ ప్రవేశించిన సందర్భంలో రాష్ట్రం మొత్తం దద్దరిల్లిందన్నారు.వైయస్‌ జగన్‌కు లక్షలాది మంది ప్రజలు ఎదురెళ్లి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికారన్నారు. అభిమాన గోదావరిని తలపించారన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాదయాత్ర ప్రభంజనంలా సాగుతుందన్నారు. ప్రతి రోజు వైయస్‌ జగన్‌ నిర్దేశించిన సమయానికి మించి పాదయాత్ర చేస్తూ, తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. పాదయాత్రకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు పెద్దలు విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. ఎవరికైనా డబ్బులు, బిర్యాని ఇచ్చామా అని ప్రశ్నించారు. తెలియని వారు ఈ రోజు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో పోటి పడి నాయకులు ఫ్లెక్సీలు కట్టి అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రజాభిమానాన్ని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జగ్గంపేట మీదుగా పాదయాత్ర రావాలని స్థానిక కో–ఆర్డినేటర్‌ కోరితే ఇక్కడికి వచ్చారని తెలిపారు. విమర్శలు చేసే వారు స్థాయిని తగ్గించుకోవద్దు అని హితవు పలికారు. గత మూడు రోజులుగా ఈ జిల్లాలో ఏవిధమైన చర్చ జరుగుతుందో అందరికి తెలిసిందన్నారు. మోసాగాళ్లకు మోసగాడు అన్న వ్యక్తిపై చర్చ పెట్టాలన్నారు. చంద్రబాబు చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. దగా పడని వ్యక్తి లేడంటే అతిశయోక్తి లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం మోసమా? నిలబెట్టుకోవడం మోసమా అర్థం చేసుకోవాలన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. 
Back to Top