నీవే మా అండ‌..దండా

-జ‌న‌నేతతో క‌లిసి న‌డుస్తున్న వేలాది మంది
-ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌న్న బిడ్డ‌కు నీరాజ‌నం
 
క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌కు క‌ర్నూలు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. త‌మ గ్రామానికి వ‌చ్చిన జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం వ‌స్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని, నీవే మా అండ‌..దండా అని వైయ‌స్ జ‌గ‌న్‌కు మొర‌పెట్టుకుంటున్నారు. మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తీసుకురావాల‌ని, మ‌మ్మ‌ల్ని ఆదుకోవాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరుకుంటున్నారు. ఈ నెల 14 నుంచి క‌ర్నూలు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మొద‌లైంది. మొద‌టి రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి నుంచి మంగళవారం 8:30 గంటలకు ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. స్థానిక ఎస్‌ఎస్‌ ధాబా నుంచి ముత్యాలపాడు బస్టాండ్‌ వరకు మండల నాయ కుడు బాబులాల్‌ ఆధ్వర్యంలో దారిపొడవునా పూలబాట వేసి జననేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి ఘనస్వాగం పలికారు. మండల నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు, కులసంఘాల నాయకులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను విన్నమించారు. జగన్నను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. జననేతను చూడటానికి మిద్దెలు, చెట్లు ఎక్కారు.వేలాది మంది జ‌న‌నేత వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో వంద కిలోమీట‌ర్లు పూర్తి చేసుకోవ‌డంతో గొడిగ‌నూరు గ్రామంలో రంగు రంగుల ముగ్గులు వేసి జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. అలాగే పార్టీ జిల్లా నాయ‌కులు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, శిల్పా మోహ‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే ఐజ‌య్య‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి,  గంగుల నాని, గంగుల సుభాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు, బాచాపురం రాఘవేంద్రారెడ్డి, లడ్డుబాయ్, సుధాకర్‌రెడ్డి, గంధం రాఘవరెడ్డి, ఎస్‌ భరత్‌కుమార్, గుండామణి, యాదవాడ నరసింహారెడ్డి, నర్సపురం సర్పంచ్‌ ప్రసాద్‌రెడ్డి, గజ్జల క్రిష్ణారెడ్డి,  చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, వీరభద్రుడు, వెంకటరమణ, ముల్లా రఫీ, షబ్బీర్, హుసేన్‌వలి, గేట్లమాబు, అబ్దుల్లాబాషా, మాబుషరీఫ్, వలిసాగారి షరీఫ్,పెయింటర్‌ రఫి, మనోహర్, రామనారాయణరెడ్డి, బలస్వామి, పత్తి నారాయణ, సంజీవరాయుడు, తులసి, రామకృష్ణ, రవి, శ్రీధర్, మురళి, వీరారెడ్డి, శేషు రమేష్, చాంద్‌బాషా, కానాల మాబుబాషా, గోవిందమ్మ, బాజోజి, శ్రీనివాసులు, గిరిరాజు, రవి, నాగయ్య వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top