నంద్యాలలో తొమ్మిదవ రోజు వైయస్ జగన్ ప్రచారం

కర్నూలుః నంద్యాలలో తొమ్మిదవ రోజు వైయస్ జగన్ ఉపఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వైయస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. జననేతతో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ వైయస్ జగన్ గడపగడపలో ప్రచారం చేస్తున్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ధర్మయుద్ధంలో ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసానికి, అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top