లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం దారుణం

 
17–06–2018, ఆదివారం
గంటి, తూర్పుగోదావరి జిల్లా

ప్రపంచమంతా నాన్నల గొప్పతనాన్ని తలచుకుని మురిసిపోతున్న ఫాదర్స్‌డే రోజు.. నాన్న వేసిన బాట, అందించిన స్ఫూర్తి తాలూకు తలపులతో పాదయాత్ర మొదలుపెట్టాను. చిన్నత నాన ఆయన చిటికెన వేలు పట్టి నడిచినట్టే.. ఇప్పు డు ప్రజా జీవితంలో ఆయన ఆశయాలకు అనుగు ణంగానే ముందుకు సాగుతున్నాను. నాన్న సహచ ర్యంలో ఆయన నాకు పరిచయం చేసిన ప్రపంచం లో.. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట. ‘ప్రజలను, నన్ను విడదీయలేని చూపు నాది’ అని నాన్నగారు అనేవారు. ప్రజలకు సంబంధించిన ఏ చిన్న సమస్యకైనా ఆయన స్పందించిన తీరు, అందించిన భరోసాలే ఆయనను కోట్లాది మంది గుండెల్లో కొలువయ్యేలా చేశాయి. మానవత్వానికి ప్రతిరూ పంలా వెలిగిన ఆ తండ్రి బిడ్డగా.. ప్రతిక్షణం నేను గర్వపడుతూనే ఉంటాను. 

విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవ రకూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదంటూ ఆందోళన వెలిబుచ్చారు.. ఉదయం నన్ను కలిసిన విద్యార్థి సంఘ ప్రతినిధులు. నిబంధనల ప్రకారం ఏప్రిల్‌లోనే పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉండగా.. ముడుపుల బాగోతం తేలకపోవడంతో మే నెల చివ రి వరకూ ముద్రణ టెండర్లనే ఖరారు చేయలేదని, దీంతో ఆగస్టు, సెప్టెంబర్‌ వరకూ పుస్తకాలు అందే పరిస్థితి కనిపించడం లేదని ఆ సోదరులు చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దల అనుయాయులు, బినామీలైనటువంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులూ లేకున్నా పాఠ్య పుస్తకాలు ముద్రించి.. అధిక రేట్లకు తమ విద్యార్థులకు అమ్ముకుంటూ దోపిడీ సాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా అక్టోబర్‌ వరకూ పుస్తకాలు అందని పరిస్థితి ఏర్పడింది. అయినా కళ్లు తెరవని, పాఠాలు నేర్వని ఈ పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపోయి.. ముడుపుల కోసం లక్షలా దిమంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్ట డం, అదే సమయంలో ప్రయివేటు విద్యాసంస్థలకు కొమ్ముకాయడం అత్యంత దారుణమైన విషయం.   


చంద్రబాబు చేసిన పాపాలకు, అవినీతికి రాష్ట్ర క్రీడారంగం బలైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్ర ఒలింపిక్స్‌ సంఘ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం తదితరులు. ‘ఆధునిక సౌకర్యాలు కలిగిన క్రీడా ప్రాంగణాలు మొత్తం హైదరాబాద్‌ లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిని పదేళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న బాబుగారు రాత్రికి రాత్రి వాటిని వదులుకుని వచ్చేశారు’ అని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు జాతీయ క్రీడలను నిర్వహించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా.. క్రీడాప్రాంగణాలను ఏర్పరుచుకునే, అభివృద్ధి చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు.

ఆ నిధులపై కన్నేసిన చినబాబు రాష్ట్ర ఒలింపిక్స్‌ సంఘాన్ని తన బినామీల గుప్పెట్లో పెట్టే దుర్బుద్ధితో చేసిన కుటిల రాజకీయాలతో.. జాతీయ క్రీడల నిర్వహణ అవకాశం కోల్పోయామన్నారు. తద్వారా క్రీడాప్రాం గణాలను అభివృద్ధి చేసుకునే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నామంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలోని మూడు వేల పాఠశాలల క్రీడా మైదానాల అభివృద్ధి పేరుతో రూ.150 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారని, స్పోర్ట్స్‌ కోటాలోని మెడికల్‌ సీట్లను అనర్హులకు అమ్ముకున్న తన అనుయాయులకు కొమ్ముకాస్తూ.. అర్హులైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవినీతి దాహానికి క్రీడా వ్యవస్థలనే నాశనం చేశారు తండ్రీకొడుకులు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్నట్టు.. జాతీయ క్రీడల నిర్వహణనే సాధించలేకపోయిన మీరు.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తాననడం హాస్యాస్పదం కాదా? ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే.. నోబెల్‌ బహుమతి ఇస్తాననడం మీ అవగాహనా రాహిత్యం కాదంటారా?  
-వైయ‌స్‌ జగన్‌ 

Back to Top