జ‌న నీరాజ‌నంప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ ఆర్ సీపీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర  దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించి రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. లంచ్ విరామం అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జిపై ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగ‌నుంది. ఇక్క‌డి నుంచి జ‌న‌నేత కోత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర అడుగుపెడుతోంది. 

మంగళవారం రోజున.. గోదావరికి ముందుగానే వరద వచ్చిందా.. అన్నట్లుగా కొవ్వూరు–రాజమహేంద్రవరం మధ్య అఖండ గోదావరిపై రాజన్న బిడ్డకు ప్రజలు జననీరాజనం పలికారు. గోదావరి ఉప్పెనలా.. రోడ్డు కం రైల్‌ బ్రిడ్జిపై జనం జననేతను చూడటానికి పోటెత్తారు. 4.1 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. భారీ సంఖ్యలో పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు బ్రిడ్జిపై వైయ‌స్‌ జగన్‌తో అడుగు వేశారు. కేరింతలు కొడుతూ యువత తమ నాయుకుడిని చూడటానికి గోదావరి వరదలా తరలివచ్చారు. రోడ్డు కం బ్రిడ్జి నుంచి మొదలు పెడితే రాజమండ్రి బహిరంగ సభ వరకూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గోదావరి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మంగళవారం రోజు వచ్చిన జనసముద్రం బుధవారం రోజు కూడా కొనసాగుతోంది.  తమ బిడ్డను చూడటానికి తల్లిదండ్రలు, మనుమడితో మాట్లాడటానికి అవ్వాతాతలు, అన్నతో కష్టాలు చెపుకోవడానికి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు తరలివచ్చారు. వారందరికి భరోసా ఇస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.Back to Top