బాబుగారి వంచనకు బలికానివారున్నారా?!

23–05–2018, బుధవారం
సరిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా

ఈ రోజు ఉదయం ఉంగుటూరు రైతన్నలు నన్ను ఆక్వా చెరువుల వద్దకు తీసుకెళ్లారు. ఉత్పత్తి వ్యయం పెరిగి, గిట్టుబాటు ధరలేక, ప్రభుత్వ సాయం అందక, దళారీల దోపిడీతో నిండా మునుగుతున్న తీరును బాధగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయౖ మెన వాటా అందిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వారంగం ఇప్పుడు సంక్షోభపు కోరల్లో కూరుకుపోయిం దన్న క్షేత్రస్థాయి వాస్తవం చేదుగా అనిపించింది. నాన్నగారి హయాంలో రాజులా బతికిన తాము.. ఇప్పుడు కడు దయనీయ స్థితిలో ఉన్నామన్నారు. రైతుల పక్షాన నిలబడి, వారి సంక్షేమం కోసం నాన్నగారు పరితపిస్తే.. తన అనుయాయులైన దళారీల, బడా వ్యాపారుల పక్షాన నిలబడ్డారు బాబుగారు.

ఈ ప్రభుత్వం వేలకు వేలు లంచాలు మేసి ఇష్టారాజ్యంగా అనుమ తులు ఇవ్వడమేకాకుండా, దానితో సమానంగా.. అనదికార సాగునూ ప్రోత్సహించింది. పుష్కలంగా సాగునీరందించి, 90 పైసలకే నాణ్యమైన కరెం టు ఇచ్చి, అధికారుల ద్వారా రైతులకు తగిన సూచనలు అందించి, దళారీల పెత్తనం లేని విధంగా రైతు ప్రతినిధినే అనుసం ధానకర్తగా నియమించి, మంచి ధర కల్పించి.. నాన్నగారు రైతన్నను లాభాల బాటలో నడిపించారు. బాబు గారి పాలనలో సాగునీరు లేక, చేపల చెరువులనే రొయ్యల చెరువులుగా మార్చుకోవడంతో.. డ్రైన్లు మొత్తం ఉప్పునీటి మయమై తాగునీరూ లేక జనం విలవిల్లాడుతున్నారు. నాణ్యమైన నిరంత రాయ కరెంటూ ఇవ్వక, ఇబ్బడిముబ్బడిగా విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపి, సీడ్, దాణాల విషయంలో క్వాలిటీ నియంత్రణలేక, నాణ్యత ప్రమాణాలు పాటించక, మార్కెట్‌కు వచ్చే సమయానికి దళారీల వ్యవస్థను ప్రోత్సహించి, నిస్సహాయ రైతులను దోపిడీ చేయిస్తూ.. అప్పుల ఊబిలోకి నెడుతున్నారు బాబుగారు. ఆ రైతన్నల కష్టాలు విని మనసుకెంతో బాధనిపించింది. సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రంగానికి పూర్వవైభవం తేవాలన్న ఆలోచనలు బలపడు తుండగా అడుగులు ముందుకేశాను. 


ఆచంట మండలం కొడమంచిలికి చెందిన సుంకర సీతారామ్‌ అనే సోదరుడు వాళ్ల గ్రామం లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామక నిర్వాకం గురించి చెప్పాడు. ఉన్నత విద్యార్హతలున్న బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను కాదని, పంచాయతీ తీర్మానం లేకుండానే.. జన్మభూమి కమిటీ సూచించిన పదో తరగతి చదివిన అభ్య ర్థికే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధాకరమైన విషయ మేంటంటే.. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు వంటి చిన్నపాటి ఉద్యోగాలకు సైతం బీటెక్, ఎమ్మెస్సీ లాంటి ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులు పోటీపడుతుండటం. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కని పిస్తుంటే.. లక్షలాది ఉద్యోగాలు తెచ్చేశానంటూ బాబుగారు బూటకపు మాటలు చెబుతున్నారు. 

ఈ పాలనలో అవినీతి పెరిగిపోయి, కక్షసాదింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు మంగంపేట మైనింగ్‌ నిర్వాసితులు. ముడి ఖనిజాన్ని పౌడర్‌ రూపంలో కూడా ఎగుమతి చేయొచ్చని తెలిసి కూడా.. స్థానికంగా ఉండే పల్వరైజింగ్‌ మిల్లులకు ఇవ్వకుండా ఎగుమతి చేస్తున్నారు. ఆ దెబ్బకు దాదాపు 200 మిల్లులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. వాటిమీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన దాదాపు 20 వేల మంది కార్మికులు రోడ్డునపడుతున్నారు. ఓ వైపు ఇలా ఉపాధిని చావుదెబ్బ తీస్తూ, మరోవైపు దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలంటూ అసత్య ప్రచారాలతో మోసం చేస్తున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా తీవ్ర అన్యాయం చేస్తుండటంతో అభద్రతా భావంతో విధిలేక.. ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి ఆందోళన చేపట్టామని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు తమ మనోవ్యధను వివరించారు. పదహారేళ్లుగా కాం ట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న తమను రెగ్యుల రైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి, పబ్బం గడిచాక మంత్రులతో కాలయాపన కమిటీ వేసి నాలుగే ళ్లుగా మోసం చేస్తున్నారని చెప్పారు. పదో పీఆర్సీ సూచనల మేరకు వేతనాలు అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనమూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారా విద్యా బోధకులు. నిరుద్యోగు లైనా, ఉద్యోగులైనా, నిరక్షరాస్యులైనా,  బాబుగారి వంచనకు బలికానివారున్నారా?!

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్న గారి హయాంలో లాభాల బాట పట్టిన వ్యవసా యం, ఆక్వా రంగం.. మీ పాలనలో నష్టాల్లో కూరుకుపోవడం వాస్తవం కాదా? మీకు చిత్తశుద్ధి లేకపోవడమూ.. వ్యవసాయం, ఆక్వా రంగంలో కూడా దళారీల, బడా వ్యాపారవేత్తల దోపిడీకి మీరు కొమ్ముకాయడమే దీనికి కారణం కాదా? 
-వైయ‌స్‌ జగన్‌




తాజా వీడియోలు

Back to Top