సువ‌ర్ణ యుగం వైపు అడుగులు

 - ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా ఆద‌ర‌ణ‌
- జ‌నాభిమాన‌మే తోడుగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- అంద‌రికి భ‌రోసా ఇస్తూ ముందుకు
-రాజ‌న్న బిడ్డ‌కు బ్ర‌హ్మ‌ర‌థం
ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. అడుగ‌డుగునా జ‌నం రాజ‌న్న బిడ్డ‌కు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. నీవే మా ఆశ‌..శ్వాస‌..అండ‌..దండా అంటూ వెంట న‌డుస్తున్నారు. ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికి త‌మ స‌మ‌స్య‌ల మాల వేస్తున్నారు. మ‌ళ్లీ ఆ సువ‌ర్ణ యుగం రావాల‌ని, రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న తెస్తున్నాడ‌ని ప‌ల్లె ప‌ల్లెల్లో పండుగ చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకుంటూ  పాద‌యాత్ర చేస్తున్న  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి పల్లె జనం ఆత్మీయతతో కూడిన అడుగులు వేస్తున్నారు. పల్లెపల్లెలోనూ ఆడపడుచులు హారతిపట్టి స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజల సమస్యలు వింటూ.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. జనాభిమానమే తోడుగా ఆదివారం ఉదయం చీరాల శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ 109వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్‌ కాలేజీ, బాలాజీ థియేటర్‌, పేరాల, ఐటీసీ మీదుగా ఆదినారాయణపురం చేరుకుని రాజన్న భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతుంది. అనంతరం ఈపురుపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈపురుపాలెంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలతో మమేకం కానున్నారు. పాదయాత్రలో ఇప్పటి వరకు జననేత 1462 కిలోమీటర్లు నడిచారు. యాత్ర ప్రారంభం నుంచే వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకోవటానికి బారులు తీరారు. పేద ప్రజలకు ఆశ, శ్వాస నువ్వేనంటూ ఆయనతో తమ మనసులో ఉన్న ప్రేమను వెలిబుచ్చుతున్నారు.  ఏ మిద్దెలు, చెట్ల మీద చూసిన అభిమాన జనంతో నిండిపోతోంది. రోడ్లపై మహిళలు తన అభిమాన నేత ఎన్నో కష్టాలు పడుతూ పాదయాత్ర చేస్తున్న తీరును చూడటానికి, నీకు అండగా మేమున్నామంటూ చెప్పడానికి హారతులిస్తూ గుమ్మడికాయలు కొడుతున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుతూ ప్రార్థ‌న‌లు, పూజ‌లు చేస్తున్నారు. 
Back to Top