ప్రజాసంకల్పయాత్ర @1400 కి.మీ

- విజ‌య‌వంతంగా సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
ప్ర‌కాశం:  ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 104వ‌ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. నాగులపాడు వద్ద ఆయన పాదయాత్ర 1400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ ఓ మొక్కను నాటారు. ఇదే జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల వద్ద వైయ‌స్ జగన్ 1300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 104వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. సోమవారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్‌ అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం తక్కెళ్లపాడు చేరుకుంటారు. అక్కడ జనంతో వైయ‌స్‌ జగన్‌ మమేకం అవుతారు. ఆ తర్వాత నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదగా యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,498.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు

 • 0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017)
 • 100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
 • 200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
 • 300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
 • 400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
 • 500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
 • 600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
 • 700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
 • 800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
 • 900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
 • 1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
 • 1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
 • 1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
 • 1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
 • 1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)Back to Top