సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వైఎస్ జగన్...!

వైఎస్ జగన్ ఆరోగ్యంపై నెటిజన్ల ఆందోళన..!
ఫేస్ బుక్,ట్విట్టర్ లలో వెల్లువెత్తుతున్న మద్దతు..!

గుంటూరుః సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కు ప్రజామద్దతు వెల్లువెత్తుతోంది.  ఫేస్ బుక్, ట్విట్టర్లలో వైఎస్ జగన్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. క్షీణిస్తున్న వైఎస్ ఆరోగ్యంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు నెట్టింట్లో విస్తృతంగా శోధిస్తున్నారు. వైఎస్ జగన్ హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉండడంతో గూగుల్ లో నెటిజన్లు సెర్చింగ్ చేస్తున్నారు.

వెల్లువలా మద్దతు..!
ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆరవ రోజు నిరవధికంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ దీక్ష చేపట్టిన నాటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. ఐతే, వైఎస్ జగన్ ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో ఉద్వేగానికి లోనవుతున్నారు.

చంద్రబాబుపై నెటిజన్ల ఆగ్రహం..!
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువత నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నా..టీడీపీ,బీజేపీలకు చీమకుట్టినట్టైనా లేకపోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి..చంద్రబాబు కక్షగట్టి కుట్రలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై ప్రకటన చేయకుండా వైఎస్ జగన్ ప్రాణంతో ఆటలాడుతున్న టీడీపీనేతల వైఖరిపై విరుచుకుపడుతున్నారు. 
Back to Top