మహనీయునికి కుటుంబసభ్యుల ఘన నివాళి

ఇడుపులపాయ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద  ఘనంగా  నివాళులు అర్పించారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి, మహానేత సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అలాగే పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు వైయస్సార్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top