వైఎస్ కుటుంబానిది సాదరించే గుణం

విజయనగరం) ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కుటుంబం గురించి వ్యక్తిగత దుష్ప్రచారానికి
దిగుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 30
ఏళ్లుగా కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని ఆయన చెప్పారు. ఎవరినైనా సాదరంగా ఆహ్వానించే
గుణం ఆ కుటుంబానికి ఉందని ఆయన వివరించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న
విజయసాయిరెడ్డి.. అక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి
వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒక పార్టీలో గెలిచి, మరో
పార్టీలోకి వెళ్లటం అప్రజాస్వామికం అని విజయసాయిరెడ్డి అన్నారు. ఒక వేళ
వెళ్లదలచుకొంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు. వచ్చే
ఎన్నికల్లో అంతా సైనికుల్లా పనిచేసి, పార్టీని విజయపథంలో నడిపిద్దామని ఆయన పిలుపు
ఇచ్చారు. 

Back to Top