ఇచ్చిన మాటకు కట్టుబడేది వైయస్‌ కుటుంబం

పశ్చిమ గోదావరి: ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం వైయస్‌ కుటుంబమని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని, కొందరు బడుగు, బలహీనవర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 3,500ల కిలోమీటర్ల మేర సాగనున్న ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే 2 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి స్థానం ఇవ్వాలో వైయస్‌ఆర్‌ సీపీకి తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలని, దానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీలో కష్టపడే వారందరికీ తగిన న్యాయం జరుగుతుందని, వదంతులు నమ్మొదన్నారు.
Back to Top