వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారు


వైయ‌స్ఆర్ జిల్లా:  చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌ని క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి విమ‌ర్శించారు. రిమ్స్‌లో వైద్యం అంద‌క మృతిచెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేత శ్రీ‌నివాసులురెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను అవినాష్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌నే ల‌క్ష్యంతో రిమ్స్‌ను ఆధునీక‌రించార‌న్నారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఈ ఆసుప‌త్రిని గురించి ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యార‌ని మండిప‌డ్డారు. స‌కాలంలో వైద్యం అంద‌క అమాయ‌క ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వైద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.
Back to Top