ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధం

ప్రకాశం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధపడింది. ఏ సెంటర్‌లోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతలు సతీష్‌రెడ్డి వేసిన సవాల్‌ను స్వీకరించిన వైయస్‌ఆర్‌ సీపీ చర్చకు సిద్ధమని ప్రకటించింది. 4వ తేదీ సాయంత్రం ముహూర్తం ఖరారు చేశారు. టీడీపీ ఖరారు చేసిన సమయానికి ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు బహిరంగ చర్చకు వస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి చెప్పారు. చేయని అభివృద్ధిని టీడీపీ తన ఖాతాలో వేసుకోవాలని చేస్తోందని మండిపడ్డారు. పులివెందులతో పాటు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధితో పాటు నాలుగేళ్లుగా టీడీపీ ఏం చేసిందో కూడా చర్చిస్తామన్నారు. 
 
Back to Top