ప్ర‌జా ప్ర‌తినిధుల్ని అవ‌మాన‌ప‌రుస్తారా..! ఎంపీ అవినాష్ ఆగ్ర‌హం

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష పార్టీల ప్రజా ప్ర‌తినిధుల్ని
అవ‌మానించేట్లుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. ప్ర‌భుత్వం బాట‌లోనే అధికారులు
న‌డుస్తుండటం గ‌మ‌నార్హం. వైఎస్సార్   జిల్లాలో ఇది రుజువైంది.


వైఎస్సార్
 జిల్లా క‌లెక్ట‌ర్ కేవీ రమ‌ణ వ్య‌వ‌హార శైలి అంత‌కంత‌కూ వివాదాస్పదం
అవుతోంది. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ మానిట‌రింగ్ క‌మిటీల‌కు జిల్లా ల్లో లోక్
స‌భ స‌భ్యులు ఛైర్మ‌న్ లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.
ఈమేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 13 జిల్లాల‌కు సంబంధించిన క‌మిటీల ఛైర్మ‌న్‌ల
పేర్ల‌ను ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో చాలా స్ప‌ష్టంగా
వైఎస్సార్ జిల్లాకు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును ప్ర‌క‌టించారు. అయినా
స‌రే,   క‌లెక్ట‌ర్ ఈ నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెట్టేశారు రాజ్య‌స‌భ స‌భ్యుడు
సీఎం ర‌మేష్ ను ఛైర్మ‌న్ గా ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వాస్త‌వానికి సీఎం ర‌మేష్ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు
ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వేరే రాష్ట్రానికి చెందిన ప్ర‌జా
ప్ర‌తినిధిని ఎలా నియ‌మిస్తార‌ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం
చేశారు. అంతే కాకుండా జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే
క‌లెక్ట‌ర్ జవాబు ఇవ్వ‌టం లేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌జా
ప్ర‌తినిధుల్ని ఈ విధంగా అవ‌మానించ‌టం స‌రికాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
Back to Top