తిరుపతి నుంచి గల్ఫ్‌కు విమాన సౌకర్యం కల్పించాలిన్యూ ఢిల్లీ: తిరుపతి ఎయిర్‌ పోర్టు నుంచి గల్ఫ్‌కు విమాన సౌకర్యం కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్రం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో గురువారం ఎంపీ అవినాష్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. తిరుపతికి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, పారిశ్రామిక వేత్లలు కూడా చాలా మంది వస్తుంటారని తెలిపారు. కడప, రాజంపేట, రాయచోటి నుంచి చాలా మంది గల్ఫ్‌దేశాలకు వలస వెళ్లారని గుర్తు చేశారు. గల్ఫ్‌కు విమానాలు నడిపితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని వైయస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు.
 
Back to Top