హామీల సంగతేంటి..?

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశామని, ఏపీకి కొత్తగా చేయాల్సిందేమీ లేదని కేంద్రం చెప్పింది.  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వై.యస్‌. అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. ఈమేరకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీకి ఇదివరకే చట్టబద్ధత ఉందని వెల్లడించారు. వెనుకబడిన జిల్లాల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంకా పంపలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్హత కలిగిన వెనుకబడిన జిల్లాలను గుర్తించి, తరువాత కేంద్రం నోటిఫై చేసినప్పుడు అవి అమల్లోకి వస్తాయి’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని చంద్రబాబు, ఏపీకి అన్నీ ఇచ్చామని కేంద్ర సర్కార్ రెండు నాల్కల ధోరణితో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయి.

Back to Top