ఉద్యోగాలు ఇవ్వనపుడు భూములు వెనక్కివ్వండి: అవినాశ్‌రెడ్డి

పులివెందుల: తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులకు ఉద్యోగాలు కల్పించనపుడు వారి భూములు తిరిగి ఇచ్చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో యురేనియం ప్రాజెక్టు అధికారులు అలీ, విజయ్‌లతోపాటు భూములు కోల్పోయిన రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆవినాశ్ మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా.. బాధితులకు ఇప్పటికీ పరిహారం, ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులు తమ పాసుపుస్తకాలు అందజేసి తమకు ఉద్యోగాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
Back to Top