స్థానిక సమస్యలపై ఆరా

వైఎస్సార్ జిల్లా కడప రైల్వేస్టేషన్ లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడి సమస్యలపై ప్రయాణికులను ఆరా తీశారు. రైల్వేస్టేషన్ లో అనేక సమస్యలు, కొరతలు ఉన్నాయన్నారు. తాగునీరు కుడా సరిగా లేదని, టాయి లెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వృద్ధులు, వికలాంగులు ప్లాట్ ఫాం దాటేందుకు ఎస్క్ లేటర్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  ఈసమస్యలను గతంలోనే సౌత్ సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో రైల్వే మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. మరోసారి తీసుకెళ్తామన్నారు. ఐడిల్ గా ఉన్న రైల్వే ట్రాక్ ను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Back to Top