నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్

నెల్లూరు : కుండపోత వర్షాలకు అతలాకుతలమైన నెల్లూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత నాలుగు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ  ఉదయం ఆయన మన్సుర్ నగర్లో పర్యటించారు. బాధితులను అక్కడ  పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... భారీ వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు. వైఎస్సార్ జిల్లా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు నష్టపోయారని, ప్రతి ఇంటికి రూ.5వేల చొప్పన ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top