వైయస్సార్‌సీపీకి యువత మద్దతు

రాయచోటి రూరల్‌ : రాయచోటి పట్టణ, మండల పరిధిలోని పలువురు యువత శుక్రవారం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి సమక్షంలో వైయస్సార్‌సీపీకి మద్దతు పలికారు. ఈ మేరకు వైయస్సార్‌సీపీ యూత్‌ అధ్యక్షుడు కిషోర్‌ ఆధ్వర్యంలో యువనాయకులు ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలిశారు. ఎటువంటి సమయంలోనైనా పార్టీకి, ఎమ్మెల్యేకు అండగా ఉంటామని మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి యువకులతో మాట్లాడుతూ... యుక్తవయస్సులో ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా క్రమశిక్షణకు మారుపేరులా నిలవాలన్నారు. మద్యం , డ్రగ్స్‌కు , జూదం వంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన వారికి తెలియజేశారు. కార్యక్రమంలో షేక్‌ సఫియాన్, పఠాన్‌ ముస్తాప్, షేక్‌ మౌసూద్, ఫయాజ్‌ , గౌస్, సయ్యద్‌ బాషా తదితరులు ఉన్నారు.Back to Top