యువత వ్యాపార రంగంపై దృష్టిసారించాలి

మదనపల్లె: నిరుద్యోగ యువతీ, యువకులు వ్యాపార రంగంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ నాయకుడు ఏర్పాటు చేసుకున్న గెలాక్సీ మొబైల్‌ షోరూమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి మాట్లాడుతూ..విద్యావంతులైన యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయంశక్తితో ఎదగాలన్నారు. విద్యా, వ్యాపార రంగాలకు అత్యంత అనుకూలమైన మదనపల్లె పట్టణంలో మొబైల్‌ షోరూమ్‌ను ప్రారంభించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న జిలానీని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ సొంతంగా, ఆర్థిక స్వావలంభన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదయ్‌కుమార్, నాయకులు కత్తిక్రిష్ణమూర్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Back to Top