ఉద్యోగం ఏది బాబూ..?


విశాఖ‌: ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంటికో ఉద్యోగం, లేదంటే నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని న‌మ్మింటి ఓట్లు వేయించుకున్న చంద్ర‌బాబు నాలుగున్న‌రేళ్లు అయినా ఏ ఒక్క‌రికి ఉద్యోగం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల యువ‌త ఆగ్ర‌హంగా ఉన్నారు. విశాఖ జిల్లాలో ఎస్‌ఈజెడ్‌ అనే భూతద్దాన్ని చూపి యువతను మాయచేసి  చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ యువత మండిప‌డుతున్నారు. గురువారం య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను యువ‌త పెద్ద ఎత్తున క‌లిశారు. చంద్ర‌బాబు త‌మ‌ను మోసం చేశాడ‌ని జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు.  పరిశ్రమలు వస్తున్నాయని, యువతకు ఉద్యోగాలు కలుగుతాయంటూ నమ్మించి మోసం చేసిన  చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసమే పనిచేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని టీడీపీ నేతలు బంజారుభూములను దోచుకుంటున్నారని,క్వారీలను సొంతం చేసుకుని ఆక్రమ మైనింగ్‌లకు పాల్పడుతున్నారన్నారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే ఉపాధి, ఉద్యోగాలు వ‌స్తాయ‌ని స్థానికులు పేర్కొన్నారు.
Back to Top