వైఎస్సార్సీపీ లో చేరిక‌లు

నెల్లూరు) నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క వ‌ర్గంలో 35వ డివిజ‌న్ లో పెద్ద ఎత్తున అభిమానులు వైఎస్సార్సీపీ లో చేరారు. ముఖ్య అతిథిగా రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి హాజ‌రు అయ్యారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అంగడా ఉంటుందని, వారికి తగిన గుర్తింపునిస్తుందన్నారు. కార్యకర్తలు పార్టీ జెండాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో  పాలు పంచుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలని, పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా అలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు.  తాను ఎమ్మెల్యేగా కార్యకర్తల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్,  వెల్లంటి ఎంపీటీసీ పాదర్తి సుధాకర్, జాఫర్, వెంకటేశ్వర్లు, హసీనా, షమీఉల్లా, షాహుల్, ఇర్ఫాన్, ఖలీల్, పట్రంగి అజయ్, యూత్ జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ హరికుమార్ పాల్గొన్నారు.

Back to Top