వైయస్‌ జగన్‌ హామీలపై హర్షం


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించాలనే తపన వైయస్‌ జగన్‌లో కనిపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడలో వైయస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టి అందర్ని మోసం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. నిలుÐð త్తు మోసం చంద్రబాబు అయితే..నిలువెత్తు నమ్మకం వైయస్‌ జగన్‌ అంటున్నారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వనైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ యువతకు వరంలాంటిదన్నారు. 
 
Back to Top