వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రేపు యూత్‌ సదస్సు

కంబదూరు: వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో యూత్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్‌ గుద్దెళ్ల నాగరాజు, సింగిల్‌విండో అధ్యక్షుడు బాబురెడ్డి, తిమ్మాపురం సర్పంచ్‌ హరినాథ్‌ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే యూత్‌ సదస్సుకు ముఖ్యఅథితులుగా నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ హాజరవుతారన్నారు. మండలంలోని యువకులు తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.

Back to Top